AUS vs IND 2nd ODI:ఆసీస్ అమ్మాయికి ఇండియన్ ఫ్యాన్ ప్రపోజ్.. ఒకే చెప్పడంతో ముద్దులతో ముంచెత్తాడు! (వీడియో)

Watch Indian fan proposes his girlfriend during AUS vs IND 2nd ODI
IND vs AUS 2nd ODI: Indian Fan Proposes Australian Girl During Match | Oneindia Telugu

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా గ్యాలరీలో ఓ ఇండియన్ ఫ్యాన్ చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్‌కు చెందిన తన గర్ల్‌ఫ్రెండ్‌కు సదరు భారత అభిమాని ప్రపోజ్ చేశాడు. ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేను వేదికగా ఎంచుకున్నాడు. మోకాళ్లపై కూర్చొని తనవెంట తీసుకొచ్చిన రింగ్‌ను తన ప్రేయసి వేలికి తొడిగాడు. ఈ ఊహించని ఘటనతో ఒకింత ఆశ్చర్యానికి గురైన సదరు యువతి.. సంతోషం వ్యక్తం చేస్తూ భారత అభిమాని ప్రేమను అంగీకరించింది.

దాంతో మరింత రెచ్చిపోయిన మనోడు.. అందరూ చూస్తుండగానే ఆమె బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆసక్తికరంగా నిలిచిన ఈ సీన్ టీవీ కెమెరాలు పసిగట్టాయి. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పదే పేదే చూపించాయి. ఇక వీరి ప్రపోజ్‌ను మైదానంలోని బిగ్ స్క్రీన్‌పై చూసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ చప్పట్లతో ఈ ప్రేమ పక్షులను అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో.. క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అయింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మెరుపు సెంచ‌రీతో రాణించగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివరలో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. బుమ్రా అత్య‌ధికంగా 79, షమీ 73, చహ‌ల్ 71, సైనీ 70, జ‌డేజా 60 ప‌రుగులు ఇచ్చారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్ మళ్లీ తడబడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(28), శిఖర్ ధావన్(30) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(89), శ్రేయస్ అయ్యర్(38) ఆసీస్ ఆటగాళ్ల సూపర్ ఫీల్డింగ్‌కు మైదానం వీడారు. ప్రస్తుతం క్రీజులో రాహుల్, పాండ్యా ఉన్నారు.

India vs Australia: వారెవ్వా స్మిత్.. వాటే క్యాచ్.. అచ్చం పక్షిలా పట్టేశావ్! (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, November 29, 2020, 16:32 [IST]
Other articles published on Nov 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X