ఆలస్యంగా వెలుగులోకి: కోహ్లీకి దండం పెట్టిన పాక్ స్పిన్నర్ (వీడియో)

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ(140) సెంచరీతో చెలరేగగా కేఎల్ రాహుల్(57)లు శుభారంభం అందించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ తర్వాత విరాట్ కోహ్లీ((77) తనదైన శైలిలో విజృంభించిన పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతనికి పాక్ స్పిన్నర్ ఇమాద్ వసీం దండం పెడుతూ కనిపించాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లడంపై
ఈ మ్యాచ్‌లో ఔట్ కాకున్నా విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లడంపై సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్లకు భయపడే కోహ్లీ అలా చేశాడంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులు జోకులు పేల్చారు. టీమిండియా 46.4 ఓవర్లకు గాను 305/4 ఉన్న స్థితిలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు.
ఆమీర్ బౌలింగ్‌లో ఔట్
వర్షం వెలిసిన తర్వాత విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్ తిరిగి క్రీజులోకి వచ్చారు. ఇన్నింగ్స్ 48 ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్ శంకర్ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్ తీశాడు. దీంతో స్టైకింగ్ ఎండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక, ఆమిర్ వేసిన నాలుగో బంతిని బౌన్సర్‌గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ పుల్ చేయబోగా అది కీపర్ చేతుల్లో పడింది.
తలవంచుకొని పెవిలియన్‌కు
దీనిపై ఔట్‌కు సర్ఫరాజ్ బలంగా అప్పీల్ చేయకపోయినా, అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ వెంటనే తలవంచుకొని పెవిలియన్ వైపు బయల్దేరాడు. అంపైర్ ఔట్‌గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్ బంతి తాకనే లేదని తేలింది. బ్యాట్ హ్యాండిల్ కాస్త వదులవడం వల్ల శబ్దం వచ్చి విరాట్ కోహ్లీ తాను ఔట్ అని భ్రమపడినట్లు తేలింది. పెవిలియన్‌కు చేరాక రీప్లే చూసుకుని విరాట్ కోహ్లీ అసహనం చెందడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(77) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications