Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్ ఆశ్చర్యం: వింతగా పంత్ రనౌట్ అయ్యాడిలా! (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు వింత అనుభవం ఎదురైంది. 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రదీప్ సాంగ్వన్... సంజూ శాంసన్‌ను తొలి వికెట్‌గా క్లీన్ బౌల్డ్ చేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చీ రాగానే ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతిని ఆడబోయిన రిషబ్ వింత పరిస్థితుల్లో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ రనౌట్‌తో మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బంతి పంత్ ప్యాడ్‌కు తగలడంతో సాంగ్వాన్ అప్పీల్ చేశాడు.

అయితే వేంటనే బంతిని అందుకున్న సురేశ్ రైనా వికెట్ల వైపు విసరడంతో నేరుగా వికెట్లను తాకింది. పంత్ క్రీజులో లేక పోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది కనురెప్పపాటులో జరగడంతో స్టేడియం అంతా ఆశ్చర్యపోయారు. అంపైర్ థర్డ్ ఎంపైర్‌కి నివేదించినా రిషబ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు.

రిషబ్ పంత్ అవుటై తీరుపై ట్విట్టర్‌లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందువల్లనే రిషబ్ పంత్ ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని సోషల్ మీడియాలో నెజటిన్లు కామెంట్స్ పోస్టు చేశారు. మరోవైపు పంత్‌ని రనౌట్ చేసిన సురేశ్ రైనాపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+