Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాంటీ ఏంటిది: పాపని గాల్లోకి ఎగరేసి ఫీల్డింగ్ (వీడియో)

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ అంటే ఠక్కువ గుర్తుకువచ్చే పేరు జాంటీ రోడ్స్. మైదానంలో పాదరసంలా కదులుతూ బ్యాట్స్‌మెన్లకి ముచ్చెమటలు పట్టించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్ క్రికెట్‌కి వీడ్కోలు పలికినా ఇంకా ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం జాంటీ రోడ్స్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్ వరుసగా ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Watch how Jonty Rhodes practices fielding with India

బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఒత్తిడిలో సైతం ఫీల్డింగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అదరగొడుతుంది. క్రికెటర్లకి ఫీల్డింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు రోడ్స్ తను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ బంతితో కాకుండా తన కూతురు 'ఇండియా'తో స్విమ్మింగ్ ఫూల్‌లో ఈ ఫీల్డర్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

భారత్ ఆచార సంప్రదాయాలకు ముచ్చటపడిన రోడ్స్ తన కూతురికి 'ఇండియా' అని పేరు పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆదివారం ఇండియా తన రెండో పుట్టినరోజు జరుపుకొంది.

Watch how Jonty Rhodes practices fielding with India

ఇండియా 2015లో ముంబైలో పుట్టింది. దాంతో జాంటీ మన భారతదేశంపై ఇష్టంతో కుమార్తెకు ఇండియా జియాన్నే అని పేరుపెట్టాడు.

దాంతో ఆ చిట్టితల్లికి మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్‌ ద్వారా 'హ్యాపీ బర్త్‌డే ఇండియా ఫ్రమ్‌ ఇండియా' అని శుభాకాంక్షలు చేశారు. అంతేకాదు ఇండియాకి ఏకంగా 1.2 బిలియన్‌ మంది సోషల్‌మీడియా ద్వారాపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జాంటీ ఇండియా పేరిట హోమం కూడా జరిపించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+