ఆగమైన సచిన్ టెండూల్కర్.. సాయం చేసిన ఆటో డ్రైవర్‌

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్‌ సాయం చేశాడు. మంబై వీధుల్లో రూట్ మరచి ఆగమైన సచిన్‌కు సదరు ఆటోడ్రైవర్ దారి చూపాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా.. తాజాగా వెలుగు చూసింది. అది కూడా సచిన్ సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకోవడంతో తెలిసింది. జనవరిలో లిటిల్‌ మాస్టర్‌ ముంబైలోని సబర్బన్‌ వీధుల్లో తన కారులో ప్రయాణిస్తూ మెయిన్ రోడ్ చేరుకునే మార్గాన్ని మర్చిపోయాడు.

అలాంటి పరిస్థితుల్లో పక్కనే వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌ సచిన్‌ పరిస్థితిని తెలుసుకొని సాయం చేశాడు. ప్రధాన రోడ్డు వరకు తన ఆటోను ఫాలోకావాలని చెప్పి తీసుకెళ్లాడు. దాంతో లిటిల్‌ మాస్టర్‌ ఆ రోడ్డుపైకి చేరుకున్నాక ఆ ఆటోడ్రైవర్‌ని కలిసి మాట్లాడాడు. అతనికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమే కాకుండా ఒక సెల్ఫీ తీసుకునే అవకాశాన్నిచ్చాడు.

ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సచిన్‌.. కరోనాపై సెటైరిక్‌గా క్యాప్షన్ ఇచ్చాడు. 'కొద్ది నెలలుగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ మనకెంత ఉపయోగపడుతుందో మనం చూస్తున్నాం. కానీ, మనుషుల సాయానికి మించింది ఏదీ లేదు. మనమంతా ఇప్పుడు అలాంటి పరిస్థితులను కోల్పోయాం. త్వరలోనే పరిస్థితులు సర్దుకుని మాములు రోజులు వస్తాయనుకుంటున్నా. జనవరిలో కండివల్లీలో డ్రైవింగ్ చేస్తూ నేను వెళ్లాల్సిన రూట్ మర్చిపోయా. ఆఖరి నావిగేషన్ యాప్స్ కూడా నా సమస్యను పరిష్కరించలేకపోయాయి. అప్పుడు ఓ జెంటిల్‌మెన్, ఆటో డ్రైవర్ మంగేశ్ నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. నా పరిస్థితిని అర్థం చేసుకొని తన ఆటోను ఫాలో అవ్వమని చెప్పి ప్రధాన రోడ్డుకు తీసుకెళ్లాడు. వెంటనే నేను కారు దిగి అతని సాయానికి కృతజ్ఞతలు తెలిపా' అని సచిన్ పేర్కొన్నాడు.

కాగా, మాస్టర్‌ సచిన్ సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు.. మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని టీమ్‌మెనేజ్‌మెంట్‌కు సచిన్ సూచించిన విషయం తెలిసిందే. అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, November 26, 2020, 15:13 [IST]
Other articles published on Nov 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X