Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిజ్జా డెలివరీ బాయ్‌ ఎంతపని చేశాడు: శాంసన్‌ను డిస్ట్రబ్‌ (వీడియో)

Watch: How A Pizza Delivery Interrupted Sanju Samsons Sensational Knock In Hyderabad

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ను పిజ్జా డెలివరీ బాయ్‌ డిస్ట్రబ్‌ చేశాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శాంసన్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆ సమయంలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌ సైట్‌ స్క్రీన్‌ అడ్డుగా వచ్చాడు. దీంతో అతడి దృష్టి మళ్లింది. బంతి వేయడానికి వచ్చిన విజయ్‌ను చూసి శాంసన్‌ పక్కకి తప్పుకొన్నాడు. దీంతో ఒక్కసారి ఏం జరిగిందోనని మైదానంలో అభిమానులు అవాక్కయ్యారు. ఆపై వెంటనే పిజ్జా డెలివరీ బాయ్‌ అక్కడి నుంచి వెళ్లడంతో తిరిగి ఆటను ప్రారంభించారు.

పిజ్జా బాయ్‌ ఎంత పని చేశాడంటూ కామెంటేటర్స్‌ సైతం నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ నెమ్మదిగా ఆడిన శాంసన్‌ ఈ ఘటన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు అద్భుత సెంచరీ సాధించాడు.

సంజు శాంసన్ సెంచరీ నమోదు చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించలేకపోయింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు వార్నర్‌ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు చెలరేగడంతో సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Sunday, March 31, 2019, 14:51 [IST]
Other articles published on Mar 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+