న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తాను వేసిన బంతి తనకే షాకిచ్చింది: కళ్లు తిరిగి కిందపడ్డాడు

బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ను ఈ ఘటన ఎంతగానో నివ్వెర పరచింది. అయితే తాజాగా ఇంచు మించు అలాంటి సంఘటనే ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ను ఈ ఘటన ఎంతగానో నివ్వెర పరచింది. అయితే తాజాగా ఇంచు మించు అలాంటి సంఘటనే ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.

ఎడ్జిబాస్టన్ వేదికగా నాటింగమ్‌షైర్‌, బర్మింగ్‌హోం జట్ల మధ్య శనివారం టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాటింగమ్‌షైర్‌ బౌలర్‌ ల్యూక్‌ ఫ్లేచర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 28 ఏళ్ల ఫ్లేచర్‌ బౌలింగ్‌లో బర్మింగ్‌హోమ్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ హెయిన్స్‌ స్ట్రయిట్ డ్రైవ్‌ కొట్టాడు.

ఆ బంతి నేరుగా వచ్చి ఫ్లేచర్‌ తలను బలంగా తాకింది. దీంతో వెంటనే అక్కడికక్కడే మైదానంలో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనను చూసిన సహచర క్రికెటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఫిజియో వచ్చి ప్లేచర్‌కు ప్రథమ చికిత్స అందించాడు.

అనంతరం అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్లేచర్‌కు ఏమైందోనని అభిమానులు కాస్తంత కంగారు పడ్డారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉందంటూ ఇంగ్లాండ్‌ ఆటగాడు జేక్‌ బాల్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక ఫ్లేచర్‌ తనకు మద్దతుగా మెసెజ్‌ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హోమ్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X