బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ 467 ఆలౌట్, ఓ సూపర్ క్యాచ్‌కి వెనుదిరిగిన స్టీవ్ స్మిత్

హైదరాబాద్: పెర్త్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓ సూపర్ క్యాచ్‌కి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నెర్ వేసిన 105వ ఓవర్‌ను ఆడేందుకు స్మిత్ కాస్త ఇబ్బంది పడ్డాడు.
పదునైన బౌన్సర్లతో
పదునైన బౌన్సర్లతో పాటు కచ్చితమైన లైన్ అండే లెంగ్త్ డెలివరీలతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను వాగ్నెర్ ముప్పుతిప్పులు పెట్టాడు. అయితే, ఓవర్‌లో నాలుగో బంతిని ఆడటంలో స్మిత్ ఇబ్బంది పడ్డాడు. వాగ్నెర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఎలా ఆడాలో తెలియక బ్యాట్ అడ్డం పెట్టడంతో అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది.

అమాంతం గాల్లోకి ఎగిరి
ఆ సమయంలో స్లిప్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. కేవలం అది పూర్తిగా చేతిలో పడకపోయినా రెండు వేళ్లతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో స్టీవ్ స్మిత్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ 85 పరుగుల వ‍్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

ఓవర్‌నైట్ స్కోరు 257/4తో
ఓవర్‌నైట్ స్కోరు 257/4తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 27 పరుగులు జోడించిన తర్వాత స్టీవ్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు ట్రావిస్ హెడ్(114) సెంచరీ సాధించగా, కెప్టెన్ టిమ్ పైన్(79) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

నాలుగు వికెట్లు తీసిన నీల్ వాగ్నెర్
దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నెర్ నాలుగు వికెట్లు తీయగా... టిమ్ సౌథీ మూడు, గ్రాండ్ హోమ్ రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications