పాండ్యా చేసిన తప్పిదానికి భారత్ ఖాతాలో ఒక పరుగు కోత పడింది (వీడియో)


హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో హార్దిక్ పాండ్యా తప్పిదం కారణంగా భారత్‌కు ఒక పరుగు కోత పడింది. ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్ని 4, 6గా మలిచిన హార్దిక్ పాండ్యా నాలుగో బంతిని ఆన్‌సైడ్ దిశగా బాదాడు.
ఆ సమయంలో అక్కడ ఫీల్డర్ ఉండటంతో వేగంగా ఒక పరుగు పూర్తి చేసిన పాండ్యా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో భువనేశ్వర్ ఉండటంతో.. మళ్లీ తానే స్ట్రైక్ తీసుకునేందుకు వేగంగా రెండో పరుగుని కూడా పూర్తి చేశాడు. ఈ క్రమంలో చిన్న
పాటి కంగారుకు గురైన పాండ్యా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బ్యాట్‌ని జారవిడిచేశాడు.

బ్యాట్ క్రీజులోకి జారే సమయంలో
బ్యాట్ క్రీజులోకి జారే సమయంలో తన శరీరానికి తాకి ఉందని హార్దిక్ పాండ్యా భ్రమించాడు. కానీ, ఆ క్షణంలో బ్యాట్‌తో అతనికి సంబంధం లేకుండా ఉంది. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోగా.. లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గుర్తించి అంపైర్‌కి ఫిర్యాదు చేశాడు.
థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించిన ఫీల్డ్ అంపైర్
దీంతో థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించిన ఫీల్డ్ అంపైర్.. రిప్లైని పరిశీలించిన తర్వాత భారత్ స్కోరు నుంచి ఒక పరుగు కోత విధించాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ బాదిన హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ చివరి బంతికి పెవిలియన్‌కు చేరాడు. చివర్లో పాండ్యా వేగంగా ఆడటంతో పాటు ఆస్లే బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6తో మెరిశాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత జట్టులో అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications