For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్: నెట్స్‌లో పాండ్యా భారీ షాట్లు (వీడియో)

IND V SA 2019 : Hardik Pandya Gears Up For T20I Series Against South Africa || Oneindia Telugu
Watch: Hardik Pandya Gears Up For T20I Series Against South Africa

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ 15 నుంచి సఫారీలతో జరగనున్న టీ20 సిరిస్‌కు సిద్ధమయ్యాడు. త్వరలో దక్షిణాప్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యనటలో భాగంగా సపారీలు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ఈ టీ20 సిరిస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. సఫారీలతో జరిగే టీ20 సిరీస్‌కు ప్రాక్టీస్‌ ఉండాలని భావించిన హార్దిక్‌ పాండ్యా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా ధోని ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ప్రాక్టీస్‌ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్‌ పాండ్యా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్‌కు యువ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ షైనీలకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.

ధోని స్వతహాగానే తప్పుకోవడంతో

ఈ సిరీస్‌ నుంచి ధోని స్వతహాగానే తప్పుకోవడంతో యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ ద్వైపాక్షిక సిరీస్ సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంది.

మూడేళ్ల తర్వాత

మూడేళ్ల తర్వాత

ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డేలు జరగడం లేదు. చివరగా 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టీ20, వన్డే సిరిస్‌ను గెలిచినప్పటికీ టెస్టు సిరిస్‌లో మాత్రం 0-3తో ఓడిపోయింది. మళ్లీ మూడేళ్ల తర్వాత సఫారీ జట్టు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో సిరిస్ షెడ్యూల్, వేదికలు, టీవీ టైమింగ్స్ మొదలైన వివరాలు మీకోసం...

టీ20 సిరిస్ షెడ్యూల్

టీ20 సిరిస్ షెడ్యూల్

Ist T20I: September 15: Dharamshala, 7 pm IST

2nd T20I: September 18: Mohali, 7 pm IST

3rd T20I: September 22: Bengaluru, 7 pm IST

టెస్టు సిరిస్ షెడ్యూల్

టెస్టు సిరిస్ షెడ్యూల్

Ist Test: October 2-6: Visakhapatnam, 9.30 am IST

2nd Test: October 10-14: Ranchi, 9.30 am IST

3rd Test: October 19-23: Pune, 9.30 am IST

టీ20 జట్ల వివరాలు

టీ20 జట్ల వివరాలు

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ , ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (వైస్ కెప్టెన్), టెంబా బావుమా, జూనియర్ దాలా, జార్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రాబాడా తబ్రేజ్ షంసీ, జార్జ్ లిండే.

Story first published: Saturday, September 7, 2019, 12:53 [IST]
Other articles published on Sep 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+