సర్జరీ అనంతరం హార్ధిక్ పాండ్యా బేబి స్టెప్స్ చూశారా? (వీడియో)

హైదరాబాద్: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్, ట్రైనర్స్ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు.
అందులో తొలుత నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కాసేపు వీల్‌చైర్‌లో తిరిగాడు. ఈ వీడియోని పోస్టు చేసి "బేబి స్టెప్... పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి నా ప్రయాణం మొదలైంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ హార్టిక్ ఆ వీడియోని పోస్టు చేస్తూ కామెంట్ పెట్టాడు.
వెన్నునొప్పితో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా
గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యాకు గత కొద్ది రోజుల క్రితమే తన శస్త్ర చికిత్స పూర్తైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాండ్యానే స్వయంగా తన ఇనిస్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రార్ధిస్తున్నారు.

సర్జరీ నిమిత్తం లండన్‌కు పంపిన బీసీసీఐ
గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్ ఆడుతుండగా హార్దిక్ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. నొప్పి భరించలేక వెన్ను నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే, వెన్నునొప్పి గాయం మళ్లీ తిరగబెట్టడంతో పాండ్యాను బీసీసీఐ ఇటీవలే సర్జరీ నిమిత్తం లండన్‌కు పంపింది.
సర్జరీ విజయవంతం
ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడు మళ్లీ హార్దిక్ పాండ్యాకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్‌లో పాల్గొన్న పాండ్యా నేరుగా లండన్‌కు బయల్దేరి వెళ్లాడు. అక్కడ సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు.

వెన్నునొప్పి గాయంతో
సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న హార్దిక్‌ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్ టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications