Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహావిష్ణువులా: సెంచరీ అనంతరం ఫన్నీగా సంబరాలు

హైదరాబాద్: బ్యాట్స్‌మెన్లు సెంచరీలు సాధించినప్పుడు, బౌలర్లు వికెట్లు తీసినప్పుడు సంబరాలు చేసుకునే విషయం తెలిసిందే. అయితే రంజీ టోర్నీలో భాగంగా పంజాబ్‌కు చెందిన ఓ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించిన తర్వాత వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

రాయ్‌పూర్‌ వేదికగా పంజాబ్‌, ఛత్తీస్‌గడ్‌ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరుపున ఆడుతున్న ఆల్‌రౌండర్‌ గుర్‌కీరత్‌ మన్‌ సెంచరీ సాధించాడు. సాధారణంగా సెంచరీ చేస్తే బ్యాట్‌ గాల్లోకి ఎత్తి అభివాదం చేస్తుంటారు.

Watch: Gurkeerat Mann's funny celebration after hitting a century in Ranji Trophy

కానీ, పంజాబ్‌ ఆటగాడు గుర్‌కీరత్‌ మన్‌ సెంచరీ సాధించిన వెంటనే అందరిలా బ్యాట్‌ పైకిఎత్తి అభివాదం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లాగా మైదానంలో పడుకున్నాడు. ఈ సరదా సన్నివేశాన్ని చూసిన ఛత్తీస్‌గడ్‌ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అనంతరం తిరిగి మ్యాచ్‌ను కొనసాగించారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గుర్‌కీరత్‌ 112 బంతుల్లో 111 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 653/3 డిక్లేర్ చేసింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గడ్‌ 238 పరుగులకే ఆలౌటైంది. ఇక, భారత్ తరుపున మూడు వన్డేలాడిన గుర్‌కీరత్‌ మన్‌ 13 పరుగులు చేసాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన బోర్డ్ ఎలెవన్ జట్టులో కూడా ఆడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+