Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్ టిక్ టాక్ వీడియో వైరల్: టోపీ పెట్టుకున్న ఆ క్రికెటర్ ఎవరు?

 Watch: Guess The Mystery Man In Yuzvendra Chahals Tik Tok Dance Video


హైదరాబాద్:
చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తనలోని అన్ని కళలను బయటపెడుతున్నాడు. తాజాగా టిక్‌టాక్‌లో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా తరుపున అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించిన చాహల్ మ్యాచ్ అనంతరం చాహల్‌ టీవీ పేరుతో ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తుంటాడు.

ఈ ఇంటర్య్వూలో చాహల్ వేసే ప్రశ్నలు అభిమానులను సైతం నవ్వులు పూయిస్తుంటాయి. చాహల్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరిస్‌ను 4-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇరు జట్ల మధ్య ఐదో టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో సైతం టీమిండియా విజయం సాధించి సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. చాహల్ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చాహల్‌‍తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ సహా మరో ఇద్దరు యువకులు ఇందులో డ్యాన్స్‌ చేశారు.

అయితే, ఈ వీడియోలో చాహల్, శ్రేయాస్ అయ్యర్ వెనుక టోఫీ పెట్టుకుని డ్యాన్స్ వేసిన ఆటగాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Story first published: Saturday, February 1, 2020, 12:21 [IST]
Other articles published on Feb 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+