For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడియో: విరిగిన బ్యాట్‌తో సిక్స్..: చెప్పి మరీ కొట్టిన బ్యాటర్

సిడ్నీ: విమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్.. హీటెక్కిస్తోంది. తన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ రెచ్చిపోయింది. పెర్త్ స్కార్చరర్స్‌‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డాషింగ్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ ఈ మ్యాచ్‌లో దుమ్ము దులిపింది. భారీ సెంచరీతో చెలరేగింది.

నార్త్ సిడ్నీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ హీట్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంత భారీ స్కోర్ చేసిందంటే దానికి కారణం- గ్రేస్ హ్యారిస్. అద్భుతంగా చెలరేగిందామె. 59 బంతుల్లో 11 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో 136 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

Watch: Grace Harris hits six with broken bat

మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు.. టాప్ ఆర్డర్‌లో మిగ్నాన్ డు ప్రీజ్ తప్ప. మిగ్నాన్ 23 బంతుల్లో ఏడు ఫోర్లతో 39 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జార్జియా రెడ్‌మెనె- 15, కేప్టెన్ జెస్ జొనాస్సెన్- 16 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. పెర్త్ స్కార్చరర్స్‌ బౌలర్ అమీ ఎడ్గార్ మూడు వికెట్లు నేలకూల్చింది. క్లోయె ఐన్స్‌వర్త్-2 వికెట్లు పడగొట్టింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చరర్స్ ఓటమి దిశగా సాగుతోంది. 16 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిందా జట్టు. అలాన్ కింగ్- 10, లిల్లీ మిల్స్- 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ మాత్రమే సత్తా చాటింది. 30 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో 60 పరుగులు చేసింది. ఆమె అవుట్ అయిన తరువాత వెంటవెంటనే వికెట్లను కోల్పోతూ వచ్చింది పెర్త్.

Watch: Grace Harris hits six with broken bat

గ్రేస్ హ్యారిస్.. విరిగిన బ్యాట్‌తో సిక్స్ బాదడం ఈ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్. గ్రేస్ వ్యక్తిగత స్కోర్ 64 పరుగుల మీద ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆమె బ్యాట్ చీలికలు కనిపించాయి. దీన్ని సీరియస్‌గా తీసుకోలేదామె. ఈ బ్యాట్‌తో ఇంకా ఆడగలనని కామెంట్స్ చేయడం వినిపించింది.

14వ ఓవర్ రెండో బంతిని భారీ సిక్స్‌గా మలిచింది గ్రేస్. పెర్త్ స్కార్చరర్స్ బౌలర్ క్లియరీ వేసిన ఓవర్ అది. ఆ షాట్ ధాటికి బ్యాట్ రెండుగా విరిగిపోయింది. బ్యాట్ హ్యాండిల్ ఊడి వచ్చింది. హ్యాండిల్ ఆమె చేతిలో ఉంటే విరిగిన బ్యాట్ ఎగిరి అవతల పడింది. ఆమె కొట్టిన షాట్‌కు బంతి లాంగాన్‌లో ఫెన్సింగ్ దాటింది.

Story first published: Sunday, October 22, 2023, 11:27 [IST]
Other articles published on Oct 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+