Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్ బౌలింగ్‌లో మూడోసారి: మ్యాక్స్‌వెల్ వీడియో వైరల్

హైదరాబాద్: ఇండోర్ వేదికగా భారత్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ మ్యాక్స్‌వెల్‌ను చాహల్‌ అవుట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వికెట్‌ను చాహల్ తీయడం ఆసక్తికరంగా మారింది.

చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డే 12వ ఓవర్లో చాహల్‌ వేసిన బంతిని గాల్లోకి లేపిన మ్యాక్స్‌వెల్‌(39) మనీశ్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కోల్‌కతాలో జరిగిన రెండో వన్డేతో పాటు తాజాగా ముగిసిన మూడో వన్డేలో చాహల్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన మ్యాక్స్‌వెల్‌ ముందుకు రాగానే ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు.

Watch: Glenn Maxwell st MS Dhoni b Yuzvendra Chahal, again

అయితే ఇండోర్ వేదికగా ఆదివారం మ్యాక్స్‌వెల్‌ అవుటైన సమయంలో మైదానంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌ని వరుసగా మూడోసారి పెవిలియన్‌కి పంపడంతో చాహల్‌ నవ్వుతూ కనిపించాడు. వెంటనే పక్కనే ఉన్న కోహ్లీ చాహల్‌ను నవ్వుతూ అభినందించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+