హెలికాప్టర్ షాట్: ధోనిని అనుకరించిన మాక్స్‌వెల్ (వీడియో)


హైదరాబాద్: జనవరి 12 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్‌కు ముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మాక్స్‌వెల్ సరదాగా కవ్వించే ప్రయత్నం చేశాడు. తొలి వన్డేకి ముందు సరదాగా ఆ విషయాన్ని ప్రస్తావించిన మాక్స్‌వెల్.. ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అనంతరం మాక్స్‌వెల్ మాట్లాడుతూ "భారత దిగ్గజ క్రికెటర్ ధోనీ క్యాచ్‌ని ఆ మ్యాచ్‌లో జారవిడిచాను. ఆ తర్వాత బంతినే ధోనీ స్టాండ్స్‌లోకి తరలించేశాడు. జేమ్స్ ఫాల్కనర్ బౌలింగ్‌లో అనుకుంటా.. ఆ సిక్స్ 115 మీటర్ల దూరం వెళ్లింది" అని అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నాడు.
శనివారం తొలి వన్డే
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా శనివారం తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌కు ఎంపికైన ధోని మంగళవారం రోహిత్, కేదార్, సిరాజ్‌లతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో మూడు వన్డేల సిరిస్ అనంతరం కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది.

వరల్డ్ కప్ నాటికి ఫామ్ అందుకోవాలని
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. భారత్‌తో టెస్టు సిరీస్‌కి ముందు జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన మాక్స్‌వెల్.. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ నాటికి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు.

నిరాశపరుస్తున్న ధోనీ
గతేడాది నుంచి పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న ధోనీ, ఆసీస్‌తో ఇటీవలే ముగిసిన టీ20 జట్టులోనూ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోగా.... అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ సమం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications