Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెటర్లకు వింత అనుభవం: రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన అభిమాని (వీడియో)

Watch: Fan tries to kiss Rohit Sharma during Mumbai’s Vijay Hazare Trophy quarter-final match against Bihar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్లను అభిమానులు ముద్దుల రూపంలో వేధిస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి దూసుకొచ్చి మరీ తమకు ఇష్టమైన క్రికెటర్లకు ముద్దులు పెట్టాలని తహతహలాడుతున్నారు.

వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమాని ఒకరు మైదానంలో దూసుకొచ్చి అతనికి ముద్దు ఇవ్వబోయిన సంగతి తెలిసిందే.

 ఓపెనర్ రోహిత్ శర్మకు వింత అనుభవం

ఓపెనర్ రోహిత్ శర్మకు వింత అనుభవం

తాజాగా సోమవారం ఇలాంటి అనుభవమే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురైంది. వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కకపోవడంతో రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ ముంబై తరఫున బరిలోకి దిగాడు. బీహార్ జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ముంబై దూకుడుగా ఆడోతుంది.

రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయిన అభిమాని

రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చి రోహిత్ శర్మకు ముద్దు ఇవ్వబోయాడు. అంతేకాదు రోహిత్ శర్మ పాదాలకు కూడా నమస్కరించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు అమాంతం హత్తుకుని హగ్ ఇచ్చాడు. ఈ సమయంలో అభిమాని చేష్టలతో బిత్తరపోయిన రోహిత్ శర్మ ఇదేం పని అడిగాడు. అనంతరం అభిమాని అమితానందంతో మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయాడు.

కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం

కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, హైదరాబాద్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. బారికేడ్లను దాటి మరీ ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన అభిమాని వెంటనే కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేశాడు.

కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం

కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం

అంతేకాదు కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీంతో కోహ్లీ వారించడంతో సెల్ఫీ మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, పృథ్వీషా చేరుకునే సరికి వారితో కూడా సెల్పీ దిగాడు. కోహ్లీ అతడిని దూరం జరుపుతుండగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వెంటనే ఉప్పల్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కడప జిల్లాకు చెందిన అహ్మద్‌ఖాన్(20)గా గుర్తించారు. కోహ్లీ మీద అభిమానంతోనే మైదానంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. రాజ్‌కోట్ వేదికగా తొలిటెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఓ అభిమాని బారికేడ్లను తొలగించుకుని వచ్చి మరీ కోహ్లీతో సెల్ఫీ దిగాడు.

Story first published: Monday, October 15, 2018, 17:25 [IST]
Other articles published on Oct 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+