Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీపీఎల్‌: ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు (వీడియో వైరల్)

సీపీఎల్‌: ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు
WATCH: Dwayne Bravo smashes five consecutive sixes in an over during a CPL match

హైదరాబాద్: వెస్టిండిస్ ఆల్‌‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అద్భుత ప్రదర్శన చేశాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో బ్రావో ట్రిన్‌బాగో నైట్‌‌రైడర్స్‌ జట్టు తరపున ఆడుతోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంంగా శనివారం ట్రిన్‌బాగో నైట్‌‌రైడర్స్‌-సెయింట్‌ కిట్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో చెలరేగిపోయాడు. 19వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెయింట్ కిట్స్ బౌలర్ జోసెఫ్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రావో ఆ తర్వాత వరుస బంతుల్లో ఐదు సిక్సులు బాదాడు. ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో బాదడం విశేషం.

ఈ మ్యాచ్‌లో మొత్తం 11 బంతులు ఎదుర్కొన్న బ్రావో ఒక ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బ్రావో విజృంభణతో నైట్‌రైడర్స్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్‌ కిట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓడిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం బ్రావో మాట్లాడుతూ "జట్టు విజయంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజయం కోసం తహతహలాడే ఆటగాళ్లు జట్టులో ఉండటం వల్లే ఈ విజయం సాధ్యమైంది. టోర్నీలో గెలవడమే మా ప్రధాన లక్ష్యం" అని అన్నాడు.

Story first published: Monday, September 3, 2018, 12:53 [IST]
Other articles published on Sep 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+