ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా? (వీడియో)


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోచింగ్ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కోనుగోలు చేయడంతో పాటు పలువురిని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జెర్సీ వంతు వచ్చింది. ఈ సీజన్ కోసం సరికొత్త జెర్సీని మంగళవారం ఆవిష్కరించింది.

ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవని ఢిల్లీ
ఇదిలా ఉంటే ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలివలేదు. కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది. కొత్త సీజన్ కోసం కొత్త జెర్సీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.
ధోనికి సవాల్ విసిరిన పంత్
ఈ వీడియోలో ఢిల్లీ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొత్త జెర్సీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఓ సవాల్ విసిరాడు. మరో వీడియోలో కొత్త జెర్సీలు ధరించి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్ మాట్లాడారు.
ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల
కాగా, ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం.

మార్చి 24న ముంబైతో ఢిల్లీ తొలి మ్యాచ్
మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ 2019 సీజన్ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఇక, మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications