న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయా పరిగెత్తాడు: ప్రాక్టీస్ షురూ చేసిన వార్నర్ (వీడియో)

By Nageshwara Rao
Watch: David Warner, tainted by ball-tampering, back at training

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేదానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాడు. ఇందులో భాగంగా తాను ప్రాక్టీస్‌ చేస్తోన్న వీడియోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

జూన్‌ చివరి వారంలో కెనడాలో టీ20 గ్లోబల్‌ లీగ్‌ ప్రారంభంకానుంది. ఈ లీగ్‌లో ఆడేందుకు డేవిడ్ వార్నర్‌తో ఓ ప్రాంఛైజీ ఓప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ టోర్నీలో ఆడేందుకు గాను వార్నర్ కెనడాకు బయల్దేరనున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌ కోచ్ సాయంతో మైదానంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు.

'తిరిగి మైదానంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఈ సెషన్‌ కాస్త కష్టంగానే గడిచింది. ముందుకు కొనసాగుతాను' అని పేర్కొన్న వార్నర్‌ తాను ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఏడాది మార్చిలో కేప్ టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌‌లో డేవిడ్ వార్నర్‌తో పాటు స్మిత్, బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

దీంతో వార్నర్, స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధంచగా... బాన్ క్రాప్ట్‌పై తొమ్మిది నెలలు పాటు నిషేధం విధించింది. కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 గ్లోబల్‌ లీగ్‌లో పాల్గొనేందుకు వార్నర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో వార్నర్‌తో పాటు స్మిత్ కూడా ఆడనున్నాడు.

ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఆస్ట్రేలియా, కెనడాలో క్రికెట్‌ అభివృద్ధికి ఉపయోగించేందుకు ఇచ్చేస్తున్నట్లు స్మిత్‌ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 9, 2018, 15:12 [IST]
Other articles published on Jun 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X