న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: మీ నమ్మకాన్ని నిలబెట్టే సమయం మళ్లీ వచ్చింది: వార్నర్ స్పెషల్ మెసేజ్

IPL 2019 : Warner Comes Up With A Special Message For Sunrisers Hyderabad Fans | Oneindia Telugu
Watch: David Warner, Set To Make A Comeback, Reaches Out To SunRisers Hyderabad Fans With Special Message

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి 28తో ముగియనుంది. దీంతో డేవిడ్ వార్నర్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆసీస్ తరుపున వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ ఎంతో కీలకం కానుంది.

ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల: ఫస్ట్ మ్యాచ్‌ ధోనీ Vs కోహ్లీఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల: ఫస్ట్ మ్యాచ్‌ ధోనీ Vs కోహ్లీ

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్ బరిలో దిగేందుకు డేవిడ్ వార్నర్ ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌కు సంబంధించిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.

మాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు

అందులో "ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు.. ఇప్పుడు మీ నమ్మకాన్ని నిలబెట్టే సమయం మళ్లీ వచ్చింది" అంటూ వార్నర్‌ మాట్లాడిన వీడియోని సన్‌రైజర్స్ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్‌‌లో పోస్టు చేసింది. వార్నర్‌ నాయకత్వంలో 2016 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ టైటిల్ విజేతగా నిలిచింది.

114 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40.54 సగటుతో 4,014 పరుగులు

114 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40.54 సగటుతో 4,014 పరుగులు

డేవిడ్ వార్నర్‌ మొత్తం 114 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40.54 సగటుతో 4,014 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం.

రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు

రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు

ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. నగరంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న రాజ‌స్థాన్‌ vs స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Story first published: Tuesday, March 12, 2019, 10:54 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X