చిన్నపిల్లాడిలా ఏడ్చిన డేవిడ్ మిల్లర్! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 8న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. దాదాపు గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకోవడం ఢిల్లీ ఆటగాళ్లను.. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్‌ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో డేవిడ్ మిల్లర్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
ఒక్క పరుగుతో ఓడిన ఢిల్లీ
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ అప్పటికే 20 బంతుల్లో 41 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఐదో బంతికి సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్‌కు స్ట్రైక్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. తానే మ్యాచ్ ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో డేవిడ్ మిల్లర్ పరుగు తీయడానికి నిరాకరించాడు. కానీ చివరి బంతిని డేవిడ్ మిల్లర్ కనెక్ట్ చేయలేకపోవడంతో రన్ కోసం ప్రయత్నించడంతో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగుతో ఓడిపోయింది.

కుంగిపోయిన డేవిడ్ మిల్లర్
మ్యాచ్ ముగిసిన వెంటనే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ డేవిడ్ మిల్లర్‌ను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అతను తీవ్రమైన నేర భావనతో కుంగిపోయాడు. తన పొరపాటు వల్లే జట్టుకు దక్కాల్సిన రెండు పాయింట్లు చేజారాయని డేవిడ్ మిల్లర్ భావించాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత మిల్లర్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. ముఖాన్ని చేతులతో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. గెలిపించాల్సిన మ్యాచ్‌ను ఓడించాననే బాధ మిల్లర్ కళ్లలో స్పష్టంగా కనిపించింది.
నాలుగో స్థానానికి పడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది మొదటి ఓటమి. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఒక్కసారిగా నాలుగో స్థానానికి పడిపోయిందియ మరోవైపు ఈ అద్భుత విజయంతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తమ పాయింట్ల ఖాతాను తెరిచింది. ఢిల్లీ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 11న సీఎస్కేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చి జట్టును గెలిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications