గాయమైనా ఒంటి కాలితో నిలబడి మ్యాచ్‌ను గెలిపించిన డారెన్ సమీ (వీడియో)

హైదరాబాద్: గాయమైన కాలితోనే మ్యాచ్‌ను ఐదు వికెట్ల తేడాతో గెలిపించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా పెషావర్ జాల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. చివరి 7 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో డారెన్ సమీ గాయంతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అందరిలో మ్యాచ్ విజయం గురించి ఉత్కంఠ నెలకొంది.
హోరాహోరీ పోరులో చివరికి పెషావర్ జట్టే గెలుపొందింది. ఐతే ఈ మ్యాచ్‌లో పెషావర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు తొలుత సమీ గాయపడ్డాడు. కాలు నొప్పితో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ, బ్యాటింగ్‌కు మాత్రం సిద్ధమైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సమీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ షాట్లు ఆడాడు.
గాయమైన కాలుపై ఒత్తిడి పడకుండా ఒంటికాలుపై నిలబడి బ్యాటింగ్ చేస్తూ ..కేవలం 4 బంతుల్లోనే 16 పరుగులు రాబట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. దీంతో క్వెట్టా గ్లాడియేటర్స్‌పై పెషావర్ జాల్మీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జట్టుకు విజయం చేకూర్చి న అనంతరం సమీ మీడియాతో మాట్లాడాడు. 'ఆ పరిస్థితుల్లో మ్యాచ్‌ను 3 సిక్సు బౌండరీలతో ముగించేద్దామనుకున్నాను. ఎట్టకేలకు మ్యాచ్ గెలిచేశాం' అని సమీ తెలిపాడు. పవర్ హిట్టింగ్‌తో అతడు బాదిన సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications