Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో వైరల్: డ్యాన్స్ ప్లోర్‌పై ఆంబ్రోస్ మూవ్స్ చూశారా?

Watch: Curtly Ambrose Shows His Footwork On Dance Floor, Video Goes Viral

హైదరాబాద్: కోర్ట్లీ ఆంబ్రోస్‌ పాత తరం క్రికెట్ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. పేస్ బౌలింగ్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించాడు. అంతేకాదు తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 55 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్‌ డ్యాన్స్‌ షోలో కోర్ట్లీ ఆంబ్రోస్‌ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తన డ్యాన్స్‌ భాగస్వామితో కలిసి ప్రఖ్యాత గాయకుడు 'ఎడ్‌ షీరాన్'‌ ఫేమస్‌ ట్రాక్‌ 'పర్‌ఫెక్ట్'కు కోర్ట్లీ ఆంబ్రోస్‌ వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి. కోర్ట్లీ ఆంబ్రోస్‌ డ్యాన్స్ చేసిన వీడియోని వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

ఈ వీడియోని చూసిన ఓ నెటజన్ "ఇదే వేగంతో క్రికెట్ ఆడేప్పుడు పాదాలు కదిలించి ఉంటే అతడి పేరు మీద మరిన్ని పరుగులు నమోదయ్యేవి" అని సరదాగా ట్వీట్ చేశాడు. అంతరం ఆంబ్రోస్ మీడియాతో మాట్లాడుతూ "కొత్తగా ప్రయత్నించాలన్న ఆలోచన వల్లే ఈ రోజు నేనిక్కడున్నాను" అని అన్నాడు.

కాగా, వెస్టిండిస్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్ 98 టెస్టులాడి 405 వికెట్లు తీయగా... 176 వన్డేల్లో 225 వికెట్లు పడగొట్టాడు. 2000వ సంవత్సరంలో కోర్ట్లీ ఆంబ్రోస్‌‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించింది.

Story first published: Wednesday, February 20, 2019, 20:20 [IST]
Other articles published on Feb 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+