Watch: ముద్దుల కుమార్తెకు రోహిత్ శర్మ జోలపాట (వీడియో)


హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన ముద్దుల కుమార్తె సమైరాకు జోలపాట పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోహిత్ శర్మ- రితికాలకు మూడు నెలల క్రితం ఓ పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ పాపకు రోహిత్ 'సమైరా' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మ్యాచ్‌లు లేని సమయంలో రోహిత్ శర్మ తన ముద్దుల కుమార్తెతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అంతేకాదు సమైరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా సమైరాకు రోహిత్ జోలపాట పాడుతున్న వీడియోను అతడి భార్య రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
కుమార్తెకు జోల పాట
ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియోలో రోహిత్ శర్మ పాడింది నిజంగా జోల పాట అనుకుంటే పొరపాటే. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘గల్లీబాయ్'లోని పాటను రోహిత్ లాలిపాటగా పాడుతున్నాడు. రోహిత్ పాడుతుంటే సమైరా తదేకంగా చూడటం ఆ వీడియోలో చూడొచ్చు. రోహిత్ పాటపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2019 సీజన్‌ని ముంబై ఓటమితో
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2019 సీజన్‌ని ముంబై ఓటమితో ఆరంభించింది. ఆదివారం వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు.
యువరాజ్ హాఫ్ సెంచరీ వృథా
ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది.
సిక్సర్లతో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబడాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, తెవాటియా, బౌల్ట్, అక్షర్‌లు తలో వికెట్ సాధించారు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications