100 సెకన్లలో 100 సిక్సులు: బిగ్ బాష్ లీగ్‌లో క్రిస్‌లిన్ (వీడియో)

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు తానెంత ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. భుజం సర్జరీ నుంచి క్రికెట్‌లోకి తిరిగొచ్చిన తర్వాత తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం గబ్బా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
అంతేకాదు బిగ్ బాష్ లీగ్‌లో 100 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్‌లో క్రిస్ లిన్ బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. పెర్త్ షాకర్స్ బౌలర్ మైకేల్ క్లింగర్ వేసిన బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి తరలించి బిగ్ బాష్ లీగ్‌లో వందో సిక్సుని నమోదు చేశాడు.
తద్వారా ఈ టోర్నీలో 100 సిక్సులు బాదిన ఆటగాడిగా క్రిస్ లిన్ నిలిచాడు. బిగ్ బాష్ లీగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్ తర్వాత ఆరోన్ ఫించ్ (58), బ్రాడ్ హాడ్జ్ (51), క్రిస్ గేల్ (51), నిక్ మాడిన్సన్ (45), కామెరూన్ వైట్ (44)లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications