న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను మాత్రమే ఇలా చేయగలను: క్రిస్ గేల్ (వీడియో)

Watch: Chris Gayle Shows Dance Moves On Wet Floor

హైదరాబాద్: వెస్టిండీస్ ప్లేయర్లు ఎక్కడుంటే అక్కడ వినోదమే.. వాళ్లు మ్యాచ్ లోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ అదే హడావుడి చేస్తుంటారు. క్రిస్ గేల్‌.. మంచి వినోదాన్ని పంచే క్రికెట‌ర్‌. బ్యాట్ ప‌ట్టి బౌల‌ర్ల‌ను చిత‌క‌బాదుతున్నా.. ఫీల్డ్ బ‌య‌ట విచిత్ర చేష్ట‌ల‌తో అల‌రించినా అది గేల్‌కే సొంతం. బంతి పడటమే ఆలస్యం నేరుగా దానిని స్టాండ్స్‌లోకి తరలించడమే పనిగా గేల్‌ రెచ్చిపోయి ఆడుతుంటాడు. అయితే మైదానంలో ఇంత దూకుడుగా ఉండే ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ బయట మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభంలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. గేల్‌ను మించిన ఎంటర్‌టైనర్‌ ఈ ప్రపంచంలోనే లేడన్నాడు. అది ఆటలోనే కాదు.. అన్నింటిలోనూ గేల్‌ గొప్ప ఎంటర్‌టైనర్‌ అని కితాబిచ్చాడు. దీనికి తగ్గట్టుగానే గేల్ ఐపీఎల్‌లో తన జోరు కొనసాగించాడు.

Only me alone can dance on a wet floor... #Caution 😂

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

తాను ప్రాతినిధ్యం వహించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ప్లేఆఫ్‌ అర్హత సాధించలేకపోయిన టోర్నీ ఆరంభంలోనే విధ్వంసక సెంచరీ నమోదు చేసి అలరించాడు. ఇక ఐపీఎల్‌ అనంతరం భారత క్రికెటర్లతో కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొని తన డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. దానికి సంబంధించి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లోనూ తెగ హల్‌చల్‌ చేశాయి.

అయితే ప్రస్తుతం స్వదేశంలో ఉన్న గేల్‌, మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌ అయింది. తడిసిన నేలపై డ్యాన్స్‌ వేశాడు. 'కేవలం నేనొక్కడిని మాత్రమే ఇలా తడిసిన నేలపై డ్యాన్స్‌ చేయగలను' అని ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు.

Story first published: Monday, June 18, 2018, 17:12 [IST]
Other articles published on Jun 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X