Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెట్‌ లీకి ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించిన సీఎన్‌బీసీ-టీవీ18 (వీడియో)

Watch: Brett Lee faces rapid fire bouncers from CNBC-TV18

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ... ఈ పేరు భారత అభిమానులకు కూడా బాగా సుపరిచితం. తన బౌన్సర్లకు భారత్‌లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రెట్ లీ ఫౌండేషన్ ద్వారా భారత్‌లో కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవలే బ్రెట్ లీ భారత పర్యటనకు వచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భారత్‌కు వచ్చిన బ్రెట్ లీ

భారత్‌కు వచ్చిన బ్రెట్ లీ

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రెట్ లీకి సీఎన్ బీసీ-టీవీ18 న్యూస్ ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించింది. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడంతో ప్రారంభించిన బ్రెట్ లీ మీరు హుక్ చేస్తారో, డక్ చేస్తారో చూద్దామంటే మీరే చూస్తారుగా అంటూ కౌంటర్ వేశాడు. అంతేకాదు చకా చకా సమాధానం చెప్పాడు.

మ్యూజిక్, క్రికెట్‌లలో ఏది ఇష్టం?

మ్యూజిక్, క్రికెట్‌లలో ఏది ఇష్టం?

మ్యూజిక్, క్రికెట్‌లలో ఏది ఇష్టమంటే మ్యూజిక్ అని తడుముకోకుండా చెప్పాడు. క్రికెటర్ కాకపోతేనో అని అడిగితే రాక్ స్టార్ అయ్యేవాడిని బ్రెట్ లీ చెప్పాడు. బాలీవుడ్ సినిమాలో నటించాల్సి వస్తే మీ పక్కన హీరోయిన్‌గా ఎవరు ఉండాలని కోరుకుంటారని అన్న ప్రశ్నకు తనకు క్లోజ్ ఫ్రెండ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహా యజమాని ప్రీతి జింటా అని అన్నాడు.

ఫాస్ట్ బౌలర్లలో ది బెస్ట్ బుమ్రానే

ఫాస్ట్ బౌలర్లలో ది బెస్ట్ బుమ్రానే

తన క్రికెట్ ఐడల్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు గాను దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలర్లలో ది బెస్ట్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకొచ్చాడు. టీ20, వన్డేలు, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో తనకు టీ20 అంటే తనకు కొంచెం ఎక్కువ ఇష్టమని బ్రెట్ లీ చెప్పాడు.

ఫేవరెట్ హాలిడే ప్రదేశం ఇల్లే

ఎప్పుడూ ఆడేందుకు దేశవిదేశాల్లో పర్యటిస్తుండే తనకు ఫేవరెట్ హాలిడే ప్రదేశం ఇల్లేనని బ్రెట్ లీ పేర్కొన్నాడు. బటర్ చికెన్, థోడా థోడా స్పైసీగా ఉంటే చాలా ఇష్టమని బ్రెట్ లీ తెలిపాడు. తనకు 1980లు, 1990ల నాటి పాప్ స్టార్ బాన్ జోవీ పాటలంటే ఇప్పటికీ ఎంతో ఇష్టమని బ్రెట్ లీ తెలిపాడు.

Story first published: Sunday, May 12, 2019, 16:00 [IST]
Other articles published on May 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+