
వార్నింగ్‌లు అందుకున్న వారి జాబితాలో
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనేక సార్లు అంఫైర్ల వార్నింగ్‌లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా, అండర్-23 సీకే నాయుడు టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓ బౌలర్ 360 డిగ్రీలు తిరిగి బంతి వేయడాన్ని అంపైర్ తప్పుబట్టాడు.
డెడ్ బాల్‌గా ప్రకటించిన అంఫైర్
అంతేకాదు బౌలర్ వేసిన బంతి చెల్లదంటూ సిగ్నల్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే ఉత్తర్‌ప్రదేశ్, కల్యాణి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టామ్ స్పిన్నర్ శివ సింగ్ కాస్త వింతగా బౌలింగ్ చేశాడు. అతడు 360 డిగ్రీలు తిరిగి బంతి విసరగానే అంపైర్ వినోద్ శేషన్ దానిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు.

నిరసన వ్యక్తం చేసిన బౌలర్
దీనిపై బౌలర్ నిరసన వ్యక్తం చేయగా ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐసీసీ రూల్ బుక్‌లో ఇలాంటి చర్యలకు ఏం చేయాలన్న దానిపై ప్రత్యేకంగా ఓ చట్టం అంటూ లేకపోవడంతో అంఫైర్ తీసుకున్న నిర్ణయం సరైందా? లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

41.2 ప్రకారం ఓ ప్లేయర్ చర్య సరిగా ఉందా?
అయితే చట్టంలో 41.2 ప్రకారం ఓ ప్లేయర్ చర్య సరిగా ఉందా? లేదా తేల్చే హక్కు మాత్రం అంపైర్‌కు మాత్రమే ఉంది. బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను దెబ్బ తీయడానికి కావాలని బౌలర్ ఇలా చేశాడని అంపైర్ భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనపై ఓ దేశవాళీ అంఫైర్ మాట్లాడుతూ ఆ బౌలర్ అన్ని బంతులను అలాగే విసరడానికి సిద్ధమైతే అతడి బౌలింగ్‌కు అనుమతి ఇవ్వచ్చని చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications













