Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీబీఎల్: బిల్లీ స్టాన్‌లేక్ కామెడీ రనౌట్ వీడియోని చూశారా?

BBL: Billy Stanlake Comical Run-Out During Adelaide Strikers vs Sydney Thunder Match
WATCH: Billy Stanlake gets run-out in comical fashion during Adelaide Strikers vs Sydney Thunder match in BBL

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాస్ లీగ్‌లో నమోదైన ఓ రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్‌లేక్ ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.

169 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ 17వ ఓవర్‌కి 97/9తో ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో ఆ జట్టు విజయానికి 15 బంతుల్లో 72 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో క్రీజులో ఉన్న బిల్లీ స్టాన్‌‌లేక్ కామెడీగా రనౌటయ్యాడు.

ఫాస్ట్ బౌలర్ డేనియల్ శామ్స్‌ విసిరిన బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా తరలించిన కానర్ పరుగు కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని స్టాన్‌లేక్‌ని పిలిచాడు. దీనికి స్పందించిన అతను పరుగు కోసం ప్రయత్నించాడు. క్రీజుకి సమీపంలో స్టాన్‌లేక్ చేతి నుంచి బ్యాట్ జారిపోయింది. దీంతో.. బ్యాట్‌ని వదిలేసిన అతను క్రీజులోకి వచ్చాడు.

అయితే అప్పటికే బంతిని అందుకున్న వికెట్ కీపర్ వికెట్లను గీరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేయగా.. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ అతడ్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు ఆఖరి వికెట్ చేజార్చుకుని 71 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Story first published: Monday, January 14, 2019, 12:35 [IST]
Other articles published on Jan 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+