ప్రేక్షకులపై తేనెటీగలు దాడి: 15నిమిషాల పాటు నిలిచిన మ్యాచ్ (వీడియో)

హైదరాబాద్: ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన నాలుగో వన్డే ఓ అనుకోని సంఘటన వల్ల 15 నిమిషాలు నిలిచిపోయింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రేక్షకులపైకి ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి.
దీంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులు ఒక్కసారిగా మైదానం బయటకు పరుగు తీశారు. తేనెటీగల దాడి నుంచి రక్షించుకోవడం కోసం చొక్కాలు విప్పి గాల్లోకి తిప్పుకుంటూ మరీ పరుగెత్తారు. తేనెటీగలు దాడి ఘటనలో గాయపడిన పలువురు అభిమానులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది?
ఇంగ్లాండ్ లయన్స్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో మ్యాచ్ 28వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తేనెటీగల దాడి సమయంలో భారత్-ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో నడుస్తున్నాడని... వాటిని చూసిన వెంటనే ద్రవిడ్ పరుగు తీశాడని స్టేడియం నిర్వాహుకులు తెలిపారు.

తేనెటీగల దాడిలో
అయితే, తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రమే అవి దాడి చేశాయని తెలిపారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

ఇదో దురృష్టకరమైన ఘటన
ఇదో దురృష్టకరమైన ఘటనని, ప్రేక్షకుల కోసం గ్యాలరీలను శుభ్రం చేయించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రేక్షకులను పశ్చిమ దిశ గ్యాలరీ నుంచి తూర్పుదిశకు మార్చామని అన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 73 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
4-0 ఆధిక్యంలో ఇండియా-ఏ
దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఇండియా-ఏ జట్టు 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (4/49), దీపక్ చాహర్ (2/38) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో పోప్ (65), ములానే (58 నాటౌట్) రాణించారు.

రిషబ్ పంత్ హాఫ్‌సెంచరీ
అనంతరం 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టులో రిషబ్ పంత్ (73 నాటౌట్), హూడా (47 నాటౌట్), కేఎల్ రాహుల్ (42) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications