Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరదా సన్నివేశం: అంఫైర్‌ని అనుకరించి నవ్వులు పూయించాడు

హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆటలో భాగంగా మూడో రోజు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హుస్సేన్ ఫీల్డ్ అంఫైర్ నిగెల్ లాంగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించాడు.

వివరాల్లోకి వెళితే... స్పిన్నర్ మెహిదీ హసన్‌ మీర్జా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమ్మిన్స్‌ దూరంగా వెళ్లున్న బంతికి అనూహ్యంగా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. ఫీల్డ్ అంఫైర్ నిగెల్ లాంగ్ నాటౌట్ అనడంతో బంగ్లా కెప్టెన్ రివ్యూకి వెళ్లాడు.

Watch: Bangladesh's Nasir Hossain gives a unique send-off to Pat Cummins

ఈ క్రమంలో టీవీ అంపైర్‌ అవుట్‌ అని తేల్చడంతో అంపైర్‌ నిగెల్‌ తన చేతిని అవుట్ అంటూ ఎత్తే క్రమంలో ఫీల్డర్‌గా ఉన్న నాసిర్‌ అంపైర్‌ పక్కన నిల్చోని వేలెత్తుతూ అతన్ని సరదాగా అనుకరించాడు. దీంతో స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆనందంలో మునిగారు.

ఇదిలా ఉంటే ఈ టెస్టులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి టెస్టులో బంగ్లా చేతిలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. నాథన్‌ లియాన్‌ (6/60) విజృంభించి ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టెస్టులో 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్‌ స్కోరు 377/9తో నాలుగో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా అదే స్కోరు వద్ద ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 305 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ కు 72 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది. బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71.2 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. నాథన్ లియాన్‌ ధాటికి లంచ్‌ విరామానికి 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (31) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు.

దీంతో ఆస్ట్రేలియా ముందు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 86 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో మూడు వికెట్లకు 87 పరుగులు చేసి నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 వికెట్లు తీసిన లయన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు వార్నర్‌తో కలిసి సంయుక్తంగా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును కూడా దక్కించుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+