హైదరాబాద్: కరేబియన్ సూపర్ లీగ్ టీ20లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, సెయింట్ లూసియా జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం 121 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో స్పిన్నర్ క్యారీ పెర్రీ వేసిన బంతిని ఆండ్రూ ఫ్లెచర్ ఎదుర్కొన్నాడు.

ఆ బంతి బ్యాట్‌ని తాకకుండానే నేరుగా వెళ్లి వికెట్లను తగలడంతో పాటు బౌండరీ లైన్ వరకు వెళ్లింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బంతి వికెట్లను తాకినా బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో ఆండ్రూ ఫ్లెచర్ నాటౌట్‌గా నిలిచాడు.
ఆ నాలుగు పరుగులను అంపైర్ లెగ్ బైస్‌గా ప్రకటించాడు. బంతి తాకి వికెట్లకు అమర్చిన లైట్లు వెలిగినప్పటికీ బెయిల్స్ కింద పడకపోవడంతో మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోని కరేబియన్ సూపర్ లీగ్ నిర్వాహకులు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సంక్షిప్త స్కోర్లు:
ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్: 120 for 6 (Shadab 30*, Searles 27*, Shillingford 4-22)
సెయింట్ లూసియా: 118 for 9 (Fletcher 40, Sammy 25, Cooper 3-21) by four wicket