Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలోనే వరస్ట్ డెలివరీ: ఆసీస్ పేసర్ రికార్డు

హైదరాబాద్: క్రికెట్‌లో రికార్డులు సాధారణం. అందులో అరుదైన రికార్డులతో పాటు చెత్త రికార్డులను కూడా మనం చూస్తుంటాం. తాజాగా బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఓ చెత్త డెలివరీని సంధించి వార్తల్లో నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ 67 ఓవర్‌లో కమిన్స్ వేగంగా వేసిన బంతి అతని చేతి నుంచి జారిపోయి ఆఫ్ సైడ్ వైపు దూరంగా దూసుకుపోయింది. అసలు బంతి ఎక్కడ పడుతుందో అని అటు క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌తో పాటు వికెట్ల వెనుక ఉన్న ఫీల్డర్లు కూడా చూస్తుండిపోయారు.

Watch: Australian speedster Pat Cummins bowls worst delivery ever in cricket history

అయితే బంతిని సంధించిన పాట్ కమిన్స్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. దీంతో ఈ బంతిని ఫీల్డ్ అంపైర్ నిజేల్ నో బాల్‌గా ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌కే ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 221 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 30 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 155 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+