Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఔట్ ఇలాగ కూడా అవుతారా?: బౌలర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటైన బ్యాట్స్‌మన్ (వీడియో)

Watch: Australian Cricketer Involved In One Of The Most Bizarre Dismissals Ever Seen

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా సోమవారం న్యూసౌత్‌వేల్స్‌-వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతి ఫీల్డర్‌ హెల్మెట్‌కు తగిలి, అది కాస్తా గాల్లోకి లేవడంతో బౌలర్ అమాంతం ఒడిసి పట్టుకున్నాడు.

వివారాల్లోకి వెళితే వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్టు తరఫున హిల్టన్‌ కార్ట్‌రైట్‌ క్రీజులో ఉన్నాడు. రెండో ఇన‍్నింగ్స్‌లో న్యూసౌత్‌వేల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ జాసన్‌ సంగా వేసిన బంతిని హిట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటివరకూ 45 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసిన కార్ట్‌రైట్‌ కాస్త దూకుడు పెంచే క‍్రమంలో భారీగా షాట్‌ ఆడబోయాడు.

అయితే అది కాస్తా షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫీల్డర్ నిక్‌ లార్కిన్‌ హెల్మెట్‌కు తగిలి అంతే వేగంతో గాల్లోకి లేచింది. ఇంకేముంది.... గాల్లోకి లేచిన ఆ బంతిని బౌలర్‌ సంగా అమాంతం పరిగెత్తుకుంటూ క్యాచ్‌ పట్టుకోవడంతో కార్ట్‌రైట్ వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Tuesday, February 26, 2019, 15:18 [IST]
Other articles published on Feb 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+