హైదరాబాద్: టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా తన కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో ఘనంగా ముగించాడు. న్యూజిలాండ్‌తో తన సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన తొలి టీ20లో నెహ్రా తన ప్రదర్శనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఆశిష్ నెహ్రా కేవలం 29 పరుగులే ఇచ్చాడు. అయితే పాండ్యా తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో నెహ్రాకు వికెట్ దక్కకుండా పోయింది. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు.

అలాగే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కోహ్లీ జార విడిచాడు. అయితే తన ఫేర్‌వెల్ మ్యాచ్‌లో వికెట్ తీయకున్నా అద్భుతమైన ఫీల్డింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. చాహల్ వేసిన ఓ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ బ్యాక్ సైడ్‌కు ఆడగా.. లెగ్‌సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా బంతిని తన లెగ్ టెక్నిక్‌తో అందుకున్నాడు.
దీంతో కెప్టెన్ కోహ్లి వావ్ నెహ్రాజీ అంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. బౌలర్ చాహల్ సైతం చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ 'మన నెహ్రాజీ ఫూట్ టెక్నిక్ ఎలా ఉంది' అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేసింది. ఈ వీడియోని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.