దేశాన్ని గర్వపడేలా చేస్తా: అర్జున అవార్డుతో సత్కరించడంపై జడేజా (వీడియో)

హైదరాబాద్: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో తనని సత్కరించినందుకు గాను టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. స్టేడియంలో టీమిండియా గెలుపు కోసం అత్యుత్తమంగా పోరాడేందుకు ఈ అవార్డు తనకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని జడేజా చెప్పుకొచ్చాడు.

2018 సంవత్సరానికి మొత్తం 19 మందిని అర్జున అవార్డుకి కేంద్ర ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ 19 మందిలో రవీంద్ర జడేజా ఒకడు. ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన క్రీడా పురస్కారాల కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు.

ఇండియా vs విండిస్ 2019, 2nd Test: బద్దలయ్యే రికార్డులివే!

బీసీసీఐ ట్విట్టర్‌లో వీడియో

ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా మేసేజ్‌తో కూడిన ఓ వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. "అర్జున అవార్డుతో నన్ను సత్కరించినందుకు ముందుగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు అందుకున్న మిగతా విజేతలకు నా అభినందనలు. వారంతా కూడా వారి విభాగాల్లో అద్భుతంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు.

జట్టు కోసం ఎల్లప్పుడు

జట్టు కోసం ఎల్లప్పుడు

"భారతదేశం కోసం ఆడినప్పుడల్లా భారత జట్టుతోపాటు నా దేశం యొక్క ఖ్యాతిని మరింత పెంచేందుకు నేనెప్పుడూ విధేయతతో కష్టపడతాను. జట్టు కోసం ఎల్లప్పుడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు దేశాన్ని గర్వపడేలా చేస్తాను" అని జడేజా అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొలి టెస్టులో హాఫ్ సెంచరీ

తొలి టెస్టులో హాఫ్ సెంచరీ

ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో సైతం ఫరవాలేదనిపించాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన జడేజా(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముఖ్యంగా రహానేతో కలిసి టీమిండియాకు భారీ స్కోరు సాధించిపెట్టడంతో కీలకపాత్ర పోషించాడు.

టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని

టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని

టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని అందుకోవడానికి జడేజా ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా ఇప్పటివరకు 42 టెస్టులు, 42 టీ20లు, 156 వన్డేలు ఆడాడు. ఒకప్పుడు అశ్విన్, జడేజాలు తుది జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా కొనసాగినప్పటికీ... చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రాకతో చాలినన్ని అవకాశాలు దక్కడం లేదు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 30, 2019, 15:19 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X