
లండన్: టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ బౌలర్‌గా రాటుదేలిపోయాడు. ఎడం చేతి వాటం బౌలర్‌గా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. సోమవారం సర్రే సెకెండ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
మేరిలెబోన్ క్రికెట్ క్లబ్ యంగ్ క్రికెటర్స్ తరఫున ఆడిన అర్జున్ టెండుల్కర్ సర్రే సెకెండ్ టీమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నాథన్ టిల్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అర్జున్ టెండుల్కర్ చేతి నుంచి వెలువడిన ఆ బంతిని ఎదుర్కొనలేకపోయాడు టిల్లీ.బ్యాట్‌ను అడ్డు పెట్టేలోగా దూసుకెచ్చింది.
వికెట్లను ఎగురగొట్టిందా బంతి. క్లీన్ బౌల్డ్ అయ్యాడు సర్రే సెకెండ్ బ్యాట్స్‌మెన్. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టిల్లీ పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించి ఎనిమిది సెకెండ్ల నిడివి మాత్రమే ఉన్న ఓ వీడియోను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అర్జున్ టెండుల్కర్ భారత్ అండర్-19 తరఫున ఆడుతున్నాడు. ఇదివరకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన అండర్-19 జట్టు సభ్యుడు కూడా.