న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో మరో వింత ఘటన (వీడియో)

Watch: Another Bizarre Moment In Sheffield Shield As Bowler Pitches Ball Outside Pitch Area

హైదరాబాద్: ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ అయిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో క్రికెట్ అభిమానుల మెదడకు పదునుపెట్టే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం విక్టోరియా-క్విన్స్‌లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్విన్స్‌లాండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ వేసిన బంతి ఔట్‌ సైడ్‌ పిచ్‌పై పడి కీపర్‌ చేతిలోకి వెళ్లింది.

<strong>వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్నారా?</strong>వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్నారా?

ఇది నోబాల్‌ అని మైదానంలోని ఆటగాళ్లంతా భావించారు. కానీ, ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం దానిని సరైన బంతిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగా కొంత క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే దానిని ఖచ్చితంగా నోబాల్‌ అని చెబుతారు. కానీ, ఫీల్డ్‌ అంపైర్‌ తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

అంపైర్‌ నిర్ణయంతో వికెట్‌ కీపర్‌ సైతం అవాక్కయ్యాడు. మ్యాచ్‌ కామెంటేటర్లు అయితే అది ఖచ్చితంగా నోబాల్‌ అని, బంతి ఏమాత్రం పిచ్‌ మీద పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చెత్త అంఫైరింగ్‌కు ఇది మరో నిదర్శమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, February 27, 2019, 15:21 [IST]
Other articles published on Feb 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X