Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుమార్తె సమైరాతో మాట్లాడిన రోహిత్ శర్మ (వీడియో)

Watch: Animated Rohit Sharma talking to daughter Samaira from dressing room after whirlwind 71 vs WI

హైదరాబాద్: ముంబైలో జరిగిన ఆఖరి టీ20లో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. బుధవారం రాత్రి వాంఖడె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 71 పరుగులు చేశాడు. సిరిస్ విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్‌లు చెలరేగి ఆడారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సిరిస్‌లో జరిగిన మొదటి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(8, 15) పరుగులతో నిరాశపరిచాడు. తనకు సొంత మైదానమైన వాంఖడెలో రోహిత్ శర్మ వెస్టిండిస్ బౌలర్లను చీల్చి చెండాడు. పరుగుల సునామీ సృష్టించాడు. రోహిత్ ఇన్నింగ్స్ చూస్తే సెంచరీ ఖాయమని అనుకున్నారు.

అయితే, జట్టు స్కోరు 135 పరుగుల వద్ద విలియమ్స్ బౌలింగ్‌లో ఓ చెత్ షాట్‌కు పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ శర్మ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత తన భార్య రితికాతో కలిసి స్టాండ్‌లో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న తన కుమార్తె సమైరాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ అపురూప క్షణాన్ని అభిమానులు తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు.

ఆస్వాదించిన అభిమానులు

నిజంగా ఈ క్షణాన్ని అభిమానులు తెగ ఆస్వాదించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ తన కుమార్తె సమైరాతో మాట్లాడేందుకు తాను కూడా చిన్న పిల్లాడయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "రోహిత్ శర్మ స్టాండ్‌లో ఎవరితో మాట్లాడుతున్నాడో ఊహించడి?" అంటూ కామెంట్ పెట్టింది.

400 సిక్సుల క్లబ్‌లో

400 సిక్సుల క్లబ్‌లో

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. షెల్టర్ కాట్రెల్ వేసిన లెంత్ బాల్‌ను ముందు కొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా రోహిత్ భారీ సిక్సుగా మలిచాడు.

తొలి భారత క్రికెటర్‌గా

తొలి భారత క్రికెటర్‌గా

ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లు కలిపి 400కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(పాకిస్థాన్), క్రిస్ గేల్(వెస్టిండిస్)లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 534 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా... అఫ్రిది 476 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.

దిగ్గజాల సరసన

దిగ్గజాల సరసన

ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరాడు. ఇప్పటివరకు వన్డేల్లో 232 సిక్సులు, టెస్టుల్లో 52, టీ20ల్లో 120 సిక్సులతో రోహిత్ శర్మ ఖాతాలో మొత్తం 404 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు భారత జట్టులో రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్‌ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.

67 పరుగుల తేడాతో భారత్ విజయం

67 పరుగుల తేడాతో భారత్ విజయం

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Thursday, December 12, 2019, 12:57 [IST]
Other articles published on Dec 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+