
స్టేడియంలో నీటి సంక్షోభం
అయితే, తగినన్ని వాటర్ బాటిల్స్ అందుబాటులో లేకపోవడంతో స్టేడియంలో నీటి సంక్షోభం ఏర్పడింది. అదే సమయంలో అటుగా కూల్ డ్రింక్స్ అమ్మే వ్యక్తి వచ్చాడు. దీంతో వాటర్ బాటిల్స్ ఉన్నాయా? అంటూ వెండార్‌ను అభిమానులు ప్రశ్నించారు. ఇందుకు వెండార్ వాటర్ బాటిల్స్ లేవని కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయని సమాధానమిచ్చాడు.

కోపంతో ఊగిపోయిన క్రికెట్ అభిమానులు
అతడి సమాధానంతో కోపంతో ఊగిపోయిన క్రికెట్ అభిమానులు వెండార్ వద్ద ఉన్న శీతల పానీయాలను దోచుకున్నారు. ఈ సంఘటన బ్రబౌర్న్ స్టేడియంలోని బ్లాక్ నెంబర్ 14లోని 5వ నెంబర్ గేట్ వద్ద చోటు చేసుకుంది. రూ. 20 ఖరీదు ఉన్న వాటర్ బాటిల్‌కు అభిమానులు రూ.40 వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా... తగినన్ని వాటర్ బాటిల్స్ స్టేడియం నిర్వాహకులు అందించలేకపోయారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెండార్ వద్ద నుంచి కూల్ డ్రింక్స్‌ను క్రికెట్ అభిమానులు దోచుకున్నారు. నిజానికి 20 లీటర్ల వరకు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, స్టేడియం నిర్వాహకులు ఆదేశాల మేరకు వెండార్ తొలుత కూల్ డ్రింక్స్ అమ్మేందుకు మైదానంలోకి వచ్చాడు.

తిరువనంతపురం వేదికగా నవంబరు 1న ఆఖరి వన్డే
ఆ తర్వాత నీటి సంక్షోభంతో గ్యాలరీలో పరిస్థితి అదుపులోతి తీసుకొచ్చేందుకు గాను స్టేడియం నిర్వాహకులు హుటాహుటిన వాటర్ బాటిల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.


Click it and Unblock the Notifications
