Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది ఊహించలేదు!: వినూత్న సంబరాలతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఆప్ఘన్ స్పిన్నర్ (వీడియో)

Watch: Afghan Spinner Celebrating After Taking A Wicket In BBL

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో వినూత్నంగా సంబరాలు జరుపుకుని ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్‌ ఖైస్‌ అహ్మద్‌ రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. లీగ్‌లో భాగంగా శుక్రవారం హోబర్ట్‌ హరికేన్స్ vs సిడ్నీ సిక్సర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో ఖైస్‌ అహ్మద్‌ వేసిన బంతిని సిడ్నీ సిక్సర్ బ్యాట్స్‌మన్‌ టామ్‌ కరన్‌ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. వికెట్ తీసిన అనందంలో ఖైస్‌ అహ్మద్‌ గాల్లోకి ఎగిరి అమాంతం పల్టీలు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హోబర్డ్‌ హరికేన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌ ఆప్ఘన్ స్పిన్నర్ ఖైస్‌ అహ్మద్‌ (4-0-12-4) దెబ్బకు 104 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Saturday, December 21, 2019, 12:45 [IST]
Other articles published on Dec 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+