Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం ధోనిలాగే: స్టంప్స్ చూడకుండా వికెట్లను గిరాటేసిన రషీద్ (వీడియో)

Adil Rashid Pulls Off An MS Dhoni During England V Pak 5th ODI || Oneindia Telugu
WATCH: Adil Rashid pulls off an MS Dhoni during England vs Pakistan 5th ODI

హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఆదివారం పాకిస్థాన్‌‍తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ టీమిండియా వికెట్ కీపర్ ధోనీని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో అచ్చం ధోనిలాగే రషీద్ పాక్ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ కు చేర్చడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనకు దిగిన పాకిస్థాన్ 297 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో కైవసం చేసుకుంది.

అయితే, ఈ సంఘటన పాకిస్థాన్ ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో చోటు చేసుకుంది. బాబర్ అజామ్ 83 బంతుల్లో 80 పరుగులు చేసి క్రీజులో ఉంటగా.... అవతలి ఎండ్‌లో పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ ఉన్నాడు. ఈ క్రమంలో అదిల్‌ రషీద్ వేసిన బంతిని కెప్టెన్‌ ఆడాడు. సింగిల్‌ తీద్దామనే ప్రయత్నంలో లెగ్‌ సైడ్‌ వైపు బంతిని ఆడాడు.

అయితే బంతిని గమనించని బాబర్‌ అజామ్ అసాంత్ క్రీజు మధ్యలోకి పరిగెత్తుకుంటా వచ్చేశాడు. దీనిని గమనించిన వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే బంతి అందుకుని అదిల్‌ వైపు విసిరాడు. బంతిని అందుకున్న రషీద్ వెంటనే స్టంప్స్‌ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను గిరాటేయడంతో బాబర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. గతంలో ధోని సైతం న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్‌ను ఇదే విధంగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ సంఘటనను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, May 20, 2019, 16:33 [IST]
Other articles published on May 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+