Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బాధ్యతలేమిటో బోర్డు చెప్పలేదు: 'కాన్‌ఫ్లిక్ట్'పై అంబుడ్స్‌మన్‌కు సచిన్

IPL 2019 : Sachin Tendulkar Says Ombudsman Wasn't Provided Clarity On Potential 'Conflict'
Wasnt Provided Clarity on Potential Conflict: Tendulkar to Ombudsman

హైదరాబాద్: 'పరస్పర విరుద్ధ ప్రయోజనాలు' విషయంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ డీకే జైన్‌ పంపిన నోటీసుపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని సచిన్ పేర్కొన్నాడు. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడిగా ఉన్న సచిన్‌.. ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా వ్యవహరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని జస్టిస్‌ జైన్‌కు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సచిన్‌కు నోటీసు పంపారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జస్టిస్‌ జైన్‌ నోటీసుపై సచిన్‌ స్పందన

జస్టిస్‌ జైన్‌ నోటీసుపై సచిన్‌ స్పందన

ఈ నోటీసుపై సచిన్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. తనను క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా నియమించిన బోర్డు ఏనాడూ తన బాధ్యతలేమిటో స్పష్టంగా చెప్ప లేదని తన వివరణలో సచిన్‌ పేర్కొన్నాడు. జస్టిస్‌ జైన్‌ నోటీసుపై 13 పాయింట్లతో సచిన్‌ వివరణ ఇచ్చాడు.

వివరణ కోరుతుండటం ఆశ్చర్యంగా ఉంది

వివరణ కోరుతుండటం ఆశ్చర్యంగా ఉంది

"నన్ను సలహా కమిటీలో నియమించిన బీసీసీఐనే ఇప్పుడు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు విషయంలో వివరణ కోరుతుండటం ఆశ్చర్యంగా ఉంది. సీఏసీలో నా బాధ్యత ఏమిటో స్పష్టంగా చెప్పాలంటూ పదే పదే కోరినా బోర్డు నుంచి స్పందన లభించలేదు. ఆ కమిటీ కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదు" అని సచిన్ తెలిపాడు.

ముంబై ఇండియన్స్‌ జట్టు ఐకాన్‌గా

ముంబై ఇండియన్స్‌ జట్టు ఐకాన్‌గా

"దీంతో సీఏసీలో సభ్యుడిని అయినా... ముంబై ఇండియన్స్‌ జట్టు ఐకాన్‌గా కొనసాగితే వచ్చే సమస్య ఏమీ లేదు. పైగా 2013లోనే నేను ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా ఎంపికయ్యాను. ఈ విషయం తెలిసే 2015లో బీసీసీఐ నన్ను సీఏసీలో సభ్యుడిగా ఎందుకు ఎంపిక చేసింది. దీనిపై బీసీసీఐ నుంచే వివరణ కోరండి" అని సచిన్‌ అన్నాడు.

Story first published: Monday, May 6, 2019, 12:15 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+