న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ కొత్త జనరల్ మేనేజర్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీంఖాన్

Wasim Khan will be new ICC’s General Manager

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జనరల్ మేనేజర్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం ఖాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జనరల్ మేనేజర్‌గా ఉన్న జియోఫ్ అల్లార్డిస్.. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్‌ (సీఈవో)గా ఇటీవల పదోన్నతి పొందాడు. అల్లార్డిస్ ఎనిమిదేళ్లుగా జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అల్లార్డిస్ స్థానంలో వసీం ఖాన్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

వసీం ఖాన్ గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఛాన్స్ టు షైన్‌ క్రికెట్ క్లబ్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. తాజాగా ఐసీసీ జనరల్ మేనేజర్‌గా నియమితులు కావడంతో వచ్చే నెల నుంచి ఆ బాధ్యతలను నిర్వహించనున్నాడు. జనరల్ మేనేజర్‌గా తన నియామకంపై వసీం ఖాన్ స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీలో చేరినందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. క్రికెట్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ తేవడానికి, అభివృద్ధి పరచడానికి, ఐసీసీ సభ్యుల సహాయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే మహిళల క్రికెట్ మరింత ఆదరణ పొందేలా ఐసీసీ చూపెడుతున్న నిబద్ధతకు సంతోషిస్తున్నానని, దాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

ఐసీసీ సీఈవోగా నియమితులైన జియోఫ్ అలార్డిస్ జనరల్ మేనేజర్ స్థానంలో నియమితులైన వసీం ఖాన్‌ను స్వాగతించారు. క్రికెట్ వ్యవహారాల పట్ల వసీంఖాన్‌కు ఉన్న అపార అనుభవం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుందని తెలిపాడు. ఐసీసీ గ్లోబల్ గ్రోత్ స్ట్రాటజీని అమలుచేయడానికి, కొత్త ఈవెంట్స్ నిర్వహించడానికి కూడా ఆయన మార్గదర్శనం తోడ్పడుతుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ ప్రపంచ పాలక సంస్థ. ఇది 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ప్రతినిధులచే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా స్థాపించబడింది. 1965లో ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా దీని పేరు మార్చబడింది. 1987లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనే పేరు సుస్థిరమైంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. ఐసీసీలో ప్రస్తుతం 105సభ్యదేశాలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లు ఆడే 12శాశ్వత సభ్య దేశాలు, 94 అసోసియేట్ దేశాలు ఉన్నాయి. క్రికెట్ ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌ల నిర్వహణను ఐసీసీ చూసుకుంటుంది. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌గా గెర్గ్ బ్రెక్లే ఉన్నారు.

Story first published: Friday, April 22, 2022, 21:04 [IST]
Other articles published on Apr 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X