Wasim Jaffer Trolls: పాకిస్థాన్ ఎలా బొక్క బోర్లా పడ్డదో వీడియో ద్వారా చూపించిన వసీం జాఫర్..!

ఆసియాకప్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగిన సంగతి తెలిసిందే. ఆద్యంతం మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం కొదమ సింహాల్లా తలపడ్డాయి. ఇరువైపులా విజయం దోబూచులాట ఆడింది. ఇక చివరకు ఇండియా హార్దిక్ పాండ్యా (17బంతుల్లో 33పరుగులు నాటౌట్) మాస్ ఇన్నింగ్స్ వల్ల ఇండియా గెలుపొందింది. ఇకపోతే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టును ట్రోల్ చేశాడు. తరచుగా ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తూ వార్తల్లో జాఫర్ నిలుస్తుంటాడనే సంగతి తెలిసిందే. తన మీమ్స్ ఫుల్ నవ్వించేవిగానూ.. సిచువేషన్‌కు యాప్ట్ అయ్యేలాగా ఉంటాయి. అతనికి ఫాలోవర్లు కూడా ఓ రేంజులో ఉన్నారు.
ఇక సాధారణ మ్యాచ్‌లకే మీమ్స్ పోస్ట్ చేసే జాఫర్.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ లాంటి మ్యాచ్ విషయంలో తప్పకుండా తన మార్క్ చూపించక ఉంటాడా. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో ఓ ఫన్నీ వీడియో మీమ్‌ను పోస్ట్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి అనుకోకుండా నాచు లాంటి గచ్చుపై కాలు వేసి దాన్ని నుంచి కిందకు పడిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరి బొక్క బోర్ల పడి పక్కనే ఉన్న మంచుదిబ్బలో పడతాడు.
అతను చేసే ప్రయత్నం తెగ నవ్వించేలా ఉంది. ఈ వీడియోకు క్యాప్షన్‌గా.. 'టీమిండియా నుంచి ఓ ప్రత్యేక విజయం. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జడేజా అద్భుతంగా ఆడారు. ఈ గేమ్‌లో పాకిస్తాన్ ఆటతీరు ఈ వీడియోలో పేర్కొన్నట్లు ఉంది' అని జారుడు నేలపై తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించే సదరు వ్యక్తి వీడియోను జాఫర్ పోస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్ గురించి మాట్లాడితూ.. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో వల్ల భారత్ ఐదు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. హార్దిక్ తొలుత బౌలింగ్లో 4 ఓవర్లలో 25పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో కీలకమైన 33 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ (26 పరుగులకు 4వికెట్లు) కూడా రాణించాడు. దీంతో 147పరుగులకే పాకిస్థాన్‌ను భారత్ కట్టడి చేయగలిగింది. ఇక 148పరుగుల లక్ష్య ఛేదనలో 14.2 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 89పరుగులతో భారత్ కష్టాల్లో ఉన్నప్పటికీ.. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా 52పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు సూపర్ విక్టరీ అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications