Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టీమిండియా వెలకట్టలేని ఆస్తి ధోనీ.. అతడిని మించి చూడాల్సిన అవసరం లేదు'

Wasim Jaffer says MS Dhoni an asset behind the stumps and also lower down the order

ముంబై: మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి అని మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పేర్కొన్నాడు. ధోనీ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే మనం అతడిని మించి చూడాల్సిన పనిలేదు అని పేర్కొన్నాడు. ఐసీసీ 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దీంతో మహీ భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి.

ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే

ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే

తాజాగా వసీం జాఫర్‌ ట్విటర్‌లో ధోనీపై స్పందించాడు. 'వికెట్ల వెనుక, లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ ఎంతో విలువైన ఆటగాడు. అతడు టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి. ఇప్పటికే జట్టుకు ఎంతో చేసాడు. ధోనీ ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉంటే మనం అతడిని మించి చూడాల్సిన పనిలేదు. ధోనీని ఆడిస్తే కేఎల్‌ రాహుల్‌పై భారం తగ్గుతుంది. మరోవైపు రిషభ్‌ పంత్‌ను లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా ఉపయోగించుకోవచ్చు' అని మాజీ ఓపెనర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 జట్టులో చోటెక్కడుంది

జట్టులో చోటెక్కడుంది

జాఫర్ ధోనీకి అండగా నిలవగా.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం జట్టులో చోటెక్కడుంది అని అంటున్నాడు. తాజాగా సెహ్వాగ్‌ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... 'జట్టులో ధోనీకి చోటు ఎక్కడుంది?. అతడు ఎక్కడ సరిపోతాడు. రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్‌. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో రాహుల్‌ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంది' అని అన్నాడు.

చెన్నై నుంచి రాంచీకి

చెన్నై నుంచి రాంచీకి

ధోనీ చివరిసారి గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కొన్ని రోజులు భారత సైన్యంలో పని చేసాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. ఇటీవల ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లతో సాధన మొదలుపెట్టినా.. కరోనా వైరస్‌ కారణంగా అది కూడా నిలిచిపోయింది. దీంతో చెన్నై నుంచి రాంచీకి చేరిన ధోనీ అక్కడ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. బాడ్మింటన్ ఆడుతూ, బైక్ రైడ్ చేస్తూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

31 టెస్టులు.. 2 వన్డేలు

ఇటీవలే వసీం జాఫర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ఆడిన జాఫర్‌.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 1996-97లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జాఫర్‌.. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో రాణించాడు. 42 ఏండ్ల జాఫర్‌ భారత్‌ తరఫున 31 టెస్టులకు ప్రాతినిధ్యం వహిచి 1,944 పరుగులు సాధించారు. ఇందులో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో వెస్టిండీస్‌ (212), పాకిస్థాన్‌పై (202) డబుల్ సెంచరీలు చేసారు. ఇక 2 వన్డేలు ఆడి 10 పరుగులు చేసాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన జాఫర్‌.. 2008లో దక్షిణాఫ్రికాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికాపైనే తొలి వన్డే, తొలి టెస్ట్ ఆడటం విశేషం.

Story first published: Thursday, March 19, 2020, 13:10 [IST]
Other articles published on Mar 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+