For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క పిచ్‌పైనే ఆడతానంటే కుదరదు.. గిల్‌కు చుకరలేసిన మాజీ లెజెండ్!

వెస్టిండీస్ టూర్‌లో దారుణంగా ఫెయిలైన టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. మూు ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గిల్.. కేవలం మూడో వన్డేలో మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగతా అన్ని మ్యాచుల్లో దారుణంగా తేలిపోయాడు. ఈ క్రమంలోనే నాలుగో టీ20కి ముందు మాజీ దిగ్గజం వసీం జాఫర్.. గిల్‌కు కీలక సలహా ఇచ్చాడు.

కఠినమైన పిచ్‌లపై ఆడటాన్ని గిల్ త్వరగా అలవాటు చేసుకోవాలని జాఫర్ సూచించాడు. ఈ ఏడాది ఆరంభంలో గిల్ సూపర్ ఫామ్‌లో కనిపించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి పది మ్యాచుల్లో నాలుగు సెంచరీలతో చెలరేగాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా గిల్ అదరగొట్టాడు.

Shubman Gill

అయితే ఆ తర్వాత నుంచి అతని ఫామ్ యూ-టర్న్ తీసుకుంది. ఐపీఎల్ తర్వాత 11 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన అతను కేవలం ఒకే ఒక్కసారి 50 పరుగుల మార్కు దాటగలిగాడు. దీనిపై మాట్లాడిన వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌లోని నెమ్మదైన పిచ్‌లపై గిల్ ఆటతీరును జాఫర్ వివరించాడు.

బంతి ఎత్తుగా వచ్చేటప్పుడు ఆడటం గిల్‌కు అలవాటైపోయిందని, దీంతో విండీస్‌లో తేలిపోయాడని చెప్పాడు. 'ఈ విండీస్ పిచ్‌లు అన్నీ అలాగే ఉంటాయి. మనం సాధ్యమైనంత వెయిట్ చేయాలి. ఎప్పట్లా బంతిని రైజ్‌లో కొట్టడం కుదరదు. గిల్‌కు అదే ఇష్టం. ఇదే అతని ఆటతీరులో మారాల్సిన అంశం' అని జాఫర్ అన్నాడు.

Wasim Jaffer

'గిల్ ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అహ్మదాబాద్‌లో ఉన్న పరిస్థితులే అతనికి ప్రతిచోటా దొరకవు. కాబట్టి వేరే వేరే పిచ్‌లపై ఆడాలంటే.. పరిస్థితికి తగ్గట్లు అతని ఆటతీరును మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే గిల్ మళ్లీ సక్సెస్ అవుతాడు' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అహ్మదాబాద్‌ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్.

ఇక్కడ గిల్ రికార్డు అద్భుతంగా ఉంది. అతను టీ20ల్లో చేసిన ఏకైక సెంచరీ ఈ స్టేడియంలో చేసింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో, దానికి అవతల గిల్ చేసిన పరుగుల్లో ఉన్న తేడాను కూడా జాఫర్ ఎత్తిచూపాడు. ఈ స్టేడియంలో అద్భుతంగా రాణించిన గిల్.. పది ఇన్నింగ్సుల్లో 698 పరుగులతో ఆకట్టుకోవడం గమనార్హం.

Story first published: Saturday, August 12, 2023, 10:40 [IST]
Other articles published on Aug 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+