
కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ
రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన ప్లేయర్లు తొలి టీ20కి దూరంగా ఉండగా.. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచిన జట్టుతో కెప్టెన్ రోహిత్ బరిలోకి దిగబోతున్నాడు. కరోనా వల్ల టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రెస్ట్ మోడ్‌లో ఉండడంతో.. ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ బాధ్యతలను పర్యవేక్షిస్తాడు. ఇక తొలి టీ20 కోసం జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. పైగా రోహిత్ జట్టు కూర్పు విషయంలో వ్యవహరించే విధానం కూడా పకడ్బందీగా ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ తొలి టీ20 కోసం తన ప్లేయింగ్ 11 ఛాయిస్‌ను ట్విట్టర్లో పేర్కొన్నాడు. అభిమానులను కూడా తమ ప్లేయింగ్ 11ను సూచించాలంటూ అభ్యర్థించాడు.

డెడ్లీ కాంబినేషన్‌తో ప్రారంభం
ఓపెనర్లుగా డెడ్లీ కాంబో అయిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను ఫిక్స్ చేసిన జాఫర్ మిడిలార్డర్లో దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్‌లను పేర్కొన్నాడు. ఇక ఫినిషర్లుగా హార్దిక్ పటేల్, దినేష్ కార్తీక్‌లను తన అల్టిమేట్ ఛాయిస్ అని ప్రస్తావించాడు. ఇక బౌలింగ్ విషయంలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్‌లకు తుది జట్టులో చోటు ఇచ్చాడు. ఇక అనూహ్యంగా ఉమ్రాన్ మాలిక్‌ను తుది జట్టులో పేర్కొనకపోవడం గమనార్హం. అక్షర్ పటేల్‌ను పట్టించుకోని జాఫర్.. స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు.
వసీం జాఫర్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్

ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్లేయర్లు
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జాసన్ రాయ్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్, రిచర్డ్ గ్లీసన్, ఫిలిప్ సాల్ట్‌ఇండియా
తొలి టీ20కి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
2వ, 3వ టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్


Click it and Unblock the Notifications












