Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా భారత క్రికెటర్

Wasim Jaffer roped in as batting coach by Bangladesh board


హైదరాబాద్: మిర్‌పుర్‌లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెందిన అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) సీనియర్ అధికారి ఒకరు అధికారికంగా వెల్లడించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌

బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌

"మిర్‌పుర్‌లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌ను నియమించాం. ఈ మేరకు అతడితో మే నుంచి ఏప్రిల్ 2020 వరకు అంటే ఏడాదిపాటు ఒప్పందం చేసుకున్నాం. తొలుత అతడు అకాడమీలోని అండర్-16, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ హై ఫెర్మామెన్స్ యూనిట్(ఎన్‌సీఏతో సమానం)కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తారు" అని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు

వసీం జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు. రంజీ క్రికెట్‌లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన జాఫర్ చివరగా విదర్భ జట్టు తరుపున ఆడాడు. ఒక రంజీ సీజన్‌లో రెండు సార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌

రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌

జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు.

31 టెస్టు మ్యాచ్‌లాడి

31 టెస్టు మ్యాచ్‌లాడి

ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు. ఇక, భారత్ తరుపున వసీం జాఫర్ 2000 నుంచి 2008 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, May 17, 2019, 13:40 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+